అమరావతి ఆందోళన ఇప్పుడు సిని పరిశ్రమకు కూడా పాకిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఇన్నాళ్ళు అమరావతికి దూరంగా సిని పరిశ్రమ ఉందనుకున్నా అది నిజం కాదని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి సిని పరిశ్రమ రాలేదు గాని వ్యక్తిగతంగా సిని పరిశ్రమ ప్రముఖులు మాత్రం అడుగు పెట్టారని అంటున్నారు. రెండు వారాల క్రితం ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో కీలక ప్రకటన చేసారు. మూడు రాజధానులు ఉంటాయి అని సూచన ప్రాయంగా చెప్పడం,
ఆ తర్వాత కమిటి నివేదిక కూడా అదే విధంగా రావడంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన కొందరు సిని ప్రముఖులు భయపడుతున్నారు. ఒక స్టార్ హీరో ఏకంగా ఆరు వందల ఎకరాల వరకు కొనుగోలు చేస్తే మరో స్టార్ నిర్మాత అమరావతిలో ఏదో వ్యాపారం పెడదాం అనే ఉద్దేశంతో 380 ఎకరాలు ఒకేసారి కొనుగోలు చేసారని సమాచారం. రాజకీయంగా తమకు ఉన్న పరిచయాలతో కొందరు సిని పెద్దలు కూడా అమరావతిలో భారీగానే భూములు కొనుగోలు చేసారని తెలుస్తుంది.
ఇప్పుడు రాజధానిని మార్చే అవకాశం ఉందనే వ్యాఖ్యల నేపధ్యంలో వాళ్ళల్లో కొత్త భయం మొదలైనట్టు సమాచారం. వాళ్ళు కొన్నప్పుడు కోట్లు పలికిన భూమి ఇప్పుడు లక్షలకు పడిపోయిందని అంటున్నారు. భారీగా సిని పరిశ్రమ గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా కంగారు పడిపోతున్నారు. ఉన్న భూములను అమ్మేసుకుని వెళ్ళిపోదామని భావించినా అనూహ్యంగా ధరలు పడిపోవడంతో ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాక సిని పరిశ్రమ భయపడుతుంది.