విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే…!

విశాఖ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. డీడీఆర్సీ సమావేశం వేదికలో కొంత మంది నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విజయసాయిరెడ్డి రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు ఉంటున్నారు అని ఆయన వ్యాక్ఖ్యానించారు. ఇటీవల పాలవలస భూ అక్రమాలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు.

దీనితో విజయసాయిరెడ్డి కి ఎదురు తిరిగిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ…పదే పదే రాజకీయ నేతల అవినీతి అని ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. తాను నిజాయితీపరుడునని, కావాలంటే విచారణ జరిపించాలని సభలో విజయసాయిరెడ్డి తో ధర్మశ్రీ వాగ్వాదంకు దిగారు. పాలవలస భూముల వ్యవహారంలో ఎన్ ఓ సీ చట్టబద్దత ఉంటే ఇవ్వాలని, లేకుంటే లేదని అసహనం వ్యక్తం చేసారు. పదే పదే అవినీతిపరులని వ్యాఖ్యానించడం సబబు కాదని హితవు పలికారు.