చిన జీయర్ స్వామి ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్క ను అవమానించేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే సీతక్క. దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని.. సీఎం స్పందించకపోవడం బాధాకరం..స్పందించాలని పేర్కొన్నారు. పేదల ఇళ్లకు వంద గజాల జాగ దొరకడం లేదు.. మీకు మాత్రం వందల ఎకరాల స్థలం ఎలా వస్తుందని ఫైర్ అయ్యారు. జీయర్ స్వామి ఏనాడైనా పేదల ఇళ్లకు వెళ్ళారా ? ప్రకృతి దేవతల దర్శనం ఉచితంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే సీతక్క.
సమతా మూర్తి దగ్గర ఈక్వాలిటీ ఉందా ? అక్కడ దర్శనం చేసుకోవా లంటే 150రూపాయల టికెట్ పెట్టారని అగ్రహించారు. మరోసారి ఇలాంటి మటలు మాట్లాడకూడదని హెచ్చరించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ.. గాంధీల ది త్యాగాల కుటుంబమన్నారు. పక్కా పార్టీల పాచికలో భాగంగా రాహుల్ నాయ కత్వం పై కొందరు విమర్శలు చేస్తున్నారని.. మేము రాహుల్, సోనియా నాయకత్వం లోనే పనిచేస్తామని వెల్లడించారు. పదవులు తీసుకోకుండా రెండు పర్యాయాలు కాంగ్రెస్ ను అధికారంలో కి తెచ్చారన్నారు.