ప్రజల సొమ్మును నీళ్లలో పోశారు : శ్రీధర్ బాబు

-

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ప్రమాదంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెనకు ప్రమాదం పొంచి ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ఒక్కసారిగా‌ కొంతమేర కుంగింది. శనివారం సాయంత్రం సమయంలో భారీ శబ్ధంతో బి- బ్లాక్ లోని 18 ,19,20,21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. అయితే.. ఈ విషయంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టమని దీనికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

Congress did many things for poor during its reign: MLA Sridhar Babu

మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. తమను ఎందుకు అనుమతించరో చెప్పాలని ఆయన పోలీసులను ప్రశ్నించారు . తక్కువ సమయంలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కుంగిపోయిన బ్యారేజ్ పై ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును నీళ్లలో పోశారన్న శ్రీధర్ బాబు… దీనిని చూడటానికి తమ జాతీయ నేత రాహుల్ గాంధీ రావాలా అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టమని దీనికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ అధికారులు చేసిన తప్పిదం, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news