తెలంగాణలో కొత్త కొద్దిరోజులుగా రాజకీయ విమర్శలు బీభత్సం గా జరుగుతున్నాయి. నిన్నటి వరకు గవర్నర్ తమిళ సై- టిఆర్ఎస్ నేతలు కామెంట్ లు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మెన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నాయని, కొన్ని కులాల వారు మాత్రమే పరిపాలన విభాగం లో ఉండి ప్రజలను పాలిస్తున్నారు అని, బడుగు బలహీన వర్గాల ప్రజలను ముందుకు తీసుకెళ్లాలని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఈ కామెంట్ లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు. చైర్మన్ గా తన పదవీ కాలం పూర్తి అయిన దగ్గర నుంచి స్వామి గౌడ్ అధికార పక్ష నేతల తో పెద్దగా కలవాడిగా ఉన్న సందర్భాలు ఎప్పుడూ కనిపించలేదు. అధికార పక్ష నాయకులు పై స్వామిగౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషణ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.