గుళ్లు కూల్చివేతపై టీడీపీని చెడుగుడాడుకున్న వీర్రాజు !

-

అవకాశం దొరికితే చాలు టిడిపిని ఓ ఆట ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వైపు సున్నితంగా వైసీపీకి సైతం చురకలు అంటిస్తూనే టిడిపిని పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం అయిన సంఘటనపై సోము వీర్రాజు స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో స్పందించిన వీర్రాజు హిందూత్వం విషయంలో మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పుకొచ్చారు.

కృష్ణా పుష్కరాల సమయంలో ఎన్నో హిందూ దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో కూల్చివేశారు అని, ఎక్కడ వాటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయలేదని, అప్పుడు గుర్తుకు రాని హిందుత్వం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటూ సోము ప్రశ్నించారు. అప్పట్లో గుళ్ళు కూల్చివేత సంఘటనపై ఆరా తీసేందుకు తామంతా వెళ్లగా అక్కడ టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తమను అడ్డుకున్నారని వీర్రాజు గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనాలను నిర్మిస్తామంటూ, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి అని, కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తాము అంటూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే, ఎస్సీల్లో హిందువులంటే ఎవరూ మిగలరని, ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, ఓట్ల రాజకీయం కోసం ఆ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అలాగే తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కు, జగన్ బావ అనిల్ కుమార్ కు మధ్య బంధుత్వం ఉంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంను  టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాడుకుని దాని ఆధారంగానే బ్రదర్ అనిల్ కు జీవీఎల్ మేనమామ అంటూ ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.1996లో లక్ష్మీపార్వతి పార్టీ తరఫున బుచ్చయ్య పోటీ చేసి ప్రపంచంలో చంద్రబాబును ఎవరూ తిట్టంతా దారుణంగా బుచ్చయ్య చౌదరి తిట్టారని సోము వీర్రాజు గుర్తుచేశారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news