తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ బీటెక్ రవి

-

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తాజాగా తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని బీటెక్‌ రవి సందర్శించారు. వైస్సార్సీపీ మేనిఫెస్టోలో మూడు రాజధానులు చేస్తామని చెప్పలేదని బీటెక్‌ రవి తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన జగన్ సర్కార్ పై మండి పడ్డారు.

ఇకపోతే మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ బీటెక్ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. ఇవాళ స్పీకర్ ఫార్మాట్‌ లో రాజీనామా సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైస్సార్సీపీ ఎమ్మెల్యే లు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రాజీనామా చేస్తామని చెప్పాలన్నారు. వైస్సార్సీపీ చేసిన చట్టంలో ఎక్కడ కూడా జ్యూడీషియల్‌ అనే పదమే లేదని బీటెక్ రవి తెలిపారు. ఇది వరకే ఈ విషయం సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఏపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news