ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్ : జోరు మీదున్న కారు.. కానీ ?

Join Our Community
follow manalokam on social media

నాలుగో రోజుకు చేరినా ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ – వరంగల్ – ఖమ్మం స్థానంలో ఇప్పటికే 67 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో ప్రో. కోదండ రామ్ కొనసాగుతున్నారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ స్థానంలో 89 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణీ దేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ప్రో. నాగేశ్వర్ ఉండగా మూడో స్థానంలో చిన్నారెడ్డి కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతానికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతున్నా టీఆర్ఎస్ అభ్యర్ధులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లు విషయానికి వస్తే మల్లన్న కంటే కోదండరామ్ 475 ఓట్లు ఎక్కువగా సాధించినట్టు చెబుతున్నారు. ఇక ఈరోజు సాయంత్రానికి అయినా ఒక కొలిక్కి వస్తుందేమో చూడాలి మరి. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...