ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్..

తెలుగు రాష్ట్రాల్లో పెద్దల సభకు ఎన్నికలకు నోటిఫికేష్ విడుదల కానుంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 9న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్ విడుదల కానుంది. నవంబరు 29న పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజున ఫలితాలు కూడా విడుల అవుతాయి. అలాగే రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. కోవిడ్ కారణంగా గతంలో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నవంబర్ 16 వరకు నామినేషన్లను స్వీకరించడంతో పాటు స్క్రూటినీ నవంబర్ 17, నామినేషన్ల విత్ డ్రా నవంబర్ 22 చివరి తేదీలుగా ఉన్నాయి.telangana-assembly

కాగా.. తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరెవరిని ప్రతిపాదిస్తుందో అనే ఉత్కంఠత ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, రవీందర్ రావు, పాడి కౌషిక్ రెడ్డి, కోటి రెడ్డి, ఎల్ రమణలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉందని… గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తారనే వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై ఎటువంటి అధికార ప్రకటన విడుదల కాలేదు.

రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన ఎంఐఎంకు 7,మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే సునాయాసంగా ఏకగ్రీవం కానున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు. ఎమ్మెల్సీలుగా చిన గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌, సోము వీర్రాజు పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్‌.. మరో ఇద్దరి అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే