సర్కార్‌కు ఆదాయాన్ని తెచ్చేందుకే ఊరికో బెల్టు షాప్ పెట్టారు : జీవన్‌ రెడ్డి

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ సంస్థలు ఉన్నట్లుగానే భవిష్యత్తులో మద్యం డెలివరీ సంస్థలు కూడా ఏర్పడతాయని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో స్విగ్గీ, జోమాటోలాగే ఆన్ లైన్ లో బుక్ చేస్తే మద్యం ఇంటికి వచ్చేలాగా తెలంగాణలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

Jeevan Reddy: తెలంగాణ సర్కార్‌కు కనిపించే ఆదాయ మార్గాలు రెండే.. | Congress MLC  Jeevan Reddy Anger with CM KCR Telangana Suchi

ఇలాంటి సౌకర్యాలు కల్పించే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని.. ఇది కేవలం కేసీఆర్ బ్రాండ్ కే దక్కుతుందన్నారు.ప్రభుత్వం పేదప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలను దోచుకుంటూ.. మద్యం తాగే వాళ్ళ పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. మద్యంతో సమాజాన్ని బానిసలు చెయ్యొద్దని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్కార్ కు ఆదాయాన్ని తెచ్చేందుకే ఊరికో బెల్టు షాప్ పెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. సమాజాన్ని మద్యానికి బానిసలు చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య ఆలోచనా విధానామని జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news