మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, 2,3,4 రౌండల్లో బీజేపీ ఆధిక్యం కనపరిచింది. అయితే తాజాగా 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది. 5వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి 917 ఓట్ల మెజార్టీ వచ్చింది.
దీంతో 5వ రౌండ్ ముగిసే సరికి మొత్తంగా టీఆర్‌ఎస్ 1631 ఓట్ల మెజార్టీతో ఉంది. ఈ ఐదవ రౌండ్లో కాంగ్రెస్‌కు ఓట్లు రాకపోవడం గమనార్హం. అయితే.. ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. మునుగోడు లో డబ్బు, మద్యం బాగా పనిచేశాయని మండిపడ్డారు.
అక్కడ పోటీ టిఆర్ఎస్, బిజెపి మధ్య జరగడంలేదని.. రాజగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ మధ్య జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారం దిగుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఉండి బిజెపికి ఓటేయాలని చెప్పిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.