మరిన్నీ చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత.. కేజ్రీవాల్ కేసులో ఆమె పేరు ప్రస్తావన..!

-

లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు సందర్భంగా.. సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. ‘ సౌత్‌ గ్రూప్‌లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఢిల్లీ సెక్రటేరియట్‌లో కేజ్రీవాల్‌ను కలిశారు. లిక్కర్ వ్యాపారానికి సహకరించాలని కేజ్రీవాల్‌ను మాగుంట అడిగారు. వ్యాపారానికి సహకరిస్తానని.. కేజ్రీవాల్‌ మాగుంటకు హామీ ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్‌ ఫండ్ ఇవ్వాలని కోరారు. కవితను కలవాలని కేజ్రీవాల్‌ మాగుంటకు సూచించారు. ఆ తర్వాత మాగుంట కవితను కలిశారు. కవిత మాగుంటను రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారమంతా కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగిందని’ సీఐబీ వివరించింది.

ఇదిలా ఉంటే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసేందుకు కోర్టు బుధవారం పర్మిషన్ ఇచ్చింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేయగా.. వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు దరఖాస్తు చేసుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సీబీఐ కూడా అరెస్టు చేయడం చర్చనీయం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news