ఎమ్మెల్సీ కవితపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నేతలు తనను సంప్రదించారని కవిత చెప్పారు కాబట్టి.. ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నారు. కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవితకు ఎవరు ఆఫర్ ఇచ్చారో తెలుసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
ఈ వ్యవహారాన్ని రెండు పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. బిజెపి, టిఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని విమర్శించారు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో అందరి స్టేట్మెంట్లు రికార్డు చేయాలని హైకోర్టు చెప్పిందని వ్యాఖ్యానించారు. ఇలా ప్రతి వ్యవహారంలో టిఆర్ఎస్, బిజెపి ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటూ చాలా చక్కగా నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.