ఎవ్వరూ అతీతులు కాదు..ఎంఎన్‌ఎఫ్ నేత

-

భాజపా గెలిస్తే రాబోయే 50 ఏళ్ల పాటు భారత్‌ను పార్టీ పాలిస్తుందని అమిత్‌షా వ్యాఖ్యలను భాజపా మిత్ర పక్షం నేతృత్వంలోని నార్త్‌-ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌ఈడిఎ)కు చెందిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) తోసిపుచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, ఎంఎన్‌ఎఫ్‌ చీఫ్‌ జోరంతంగ మీడియాతో మాట్లాడుతూ..భాజపా అనుసరిస్తున్న హిందూత్వ రాజకీయాల కారణంగా ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. వచ్చే 50 ఏళ్ల పాటు బిజెపి పాలిస్తుందన్న సెప్టెంబర్‌లో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజకీయాలనూ ఎవరూ అతీతులు కారన్నారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని చెబుతూ..ఎంఎన్‌ఎఫ్‌, భాజపాల మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ, పార్టీ భావజాలాన్ని, ఇతర విషయాలను పరిగణిస్తే తాను పూర్తిగా భాజపా విరుద్ధమని అన్నారు. యుపిఎ కన్నా ఎన్‌డిఎ మెరుగని భావించడం వల్ల కేంద్రంతో చేతులు కలిపామని, సిద్ధాంతపరంగా భాజపాకి ఎంఎన్‌ఎఫ్‌ ఎప్పుడూ విరుద్ధమే అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news