కేంద్ర బడ్జెట్ 2022 ఎఫెక్ట్ : ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో కాసేపటి క్రితమే 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ… కరోనా కట్టడి లో వ్యాక్సినేషన్ బాగా కలిసి వచ్చిందని.. ప్రజల ప్రాణాలు కాపాడటం టీకా బాగా పని చేసిందని తెలిపారు. పేద అలాగే మధ్యతరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఇక కేంద్ర బడ్జెట్ తో కొన్ని వస్తువుల ధరలు పెరగడం, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

కేంద్ర బడ్జెట్ తో తగ్గేవి

మొబైల్ ఫోన్లు
మొబైల్ ఫోన్ చార్జర్లు
మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్ ఫార్మర్లు
వజ్రాలు (కట్ అండ్ పాలిష్డ్), రత్నాలు
అనుకరణ ఆభరణాలు (ఇమిటేషన్ జ్యుయెలరీ)
పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్
మిథనాలు, మరికొన్ని రసాయనాలు
కెమెరా లెన్సులు
స్టీల్ స్క్రాప్
వ్యవసాయ పరికరాలు
దుస్తులు
పాదరక్షలు
విదేశీ యంత్ర సామగ్రి
తోలు వస్తువులు

ధరలు పెరిగేవి

అనేక రకాల దిగుమతి వస్తువులు
విదేశీ గొడుగులు
క్రిప్టో లావాదేవీలు

Union Budget 2022: బడ్జెట్-2022 హైలెట్స్‌ ఇవే

 

Read more RELATED
Recommended to you

Latest news