బ‌డ్జెట్ క‌హానీ : ధ‌ర‌లు త‌గ్గినా నో యూజ్ !

-

కొత్త బ‌డ్జెట్ ప్ర‌సంగం వింటే జీవితం పై విర‌క్తి ఖాయం. ఏ రంగానికి ఆర్థిక శాఖ ను నిర్వ‌హిస్తున్న నిర్మ‌లా మేడ‌మ్ ఊతం ఇవ్వ‌లేదు. ఏ రంగం కూడా ఇప్పుడున్న స్థితి నుంచి కోలుకునేందుకు అవ‌కాశ‌మే లేదు.దేశమే 17ల‌క్ష‌ల కోట్ల లోటుతో ఉంది. అప్పుల‌తో ఉంది. అందుకే ఈసారి ఏ రంగం కూడా మునుప‌టిలానే త‌మ జీవ‌న ప్ర‌యాణం జీవ‌న్మ‌ర‌ణ స‌వాళ్ల‌తోనే సాగించాలి.త‌ప్ప‌దు.

మహిళ‌ల‌కు చేదువార్త.. తాగు బోతుల‌కు చేదువార్త
తిరుగుబోతుల్లారా మీరు కంట్రోల్ లో ఉండండి
ఎందుకంటే మ‌ద్యం ధ‌ర‌లు (విదేశీ స‌ర‌కు) మ‌రింత పెరుగుతుంది
వంట నూనెల ధ‌ర‌లు పైపైకే..
ఇంకా మొబైల్ ఛార్జ‌ర్ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి కూడా!
వీటితో పాటు స్మార్ట్ ఫోన్లు టీవీలు రిఫ్రిజ‌రేటర్ల ధ‌ర‌లు కూడా అదే విధంగా
ఇంకొన్ని ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి.
తిరుగుబోతుల గురించి చెప్పాను క‌దా! వాళ్లకు కూడా చెప్పే జాగ్ర‌త్త‌లు ఏంటంటే
లెద‌ర్ ఉత్ప‌త్తులు షూ పాలిష్ త‌దిత‌రాల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి అని!

ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ బ‌డ్జెట్ అంతా నిరాశాజ‌నకంగానే ఉంది. ఏ ఒక్క‌టీ సామాన్యుడికి మేలు చేసే విధంగా లేదు. కాస్తో కూస్తో పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌ల ఇక పెర‌గ‌వు అని చెప్పినా రాష్ట్రాలు తాము విధిస్తున్న ప‌న్నుల కార‌ణంగా పెద్ద‌గా వారి జీవితాల్లో మార్పు ఉండదు. కేంద్రం దిగివ‌చ్చినా ఏపీ,త‌మిళ‌నాడుతో స‌హా చాలా రాష్ట్రాలు త‌మ వాటా ప‌న్నును త‌గ్గించుకోక‌పోవ‌డం వ‌ల్ల పెద్ద‌గా కేంద్రం ప్ర‌క‌ట‌న‌తో ఎటువంటి ఫ‌లితం ఉండదు.ఇదే స‌మ‌యంలో రైతుల‌కు చేదు వార్త ఏంటంటే ఎరువుల ధ‌ర‌లు ఇంకా పెర‌గ‌బోతున్నాయి.దీంతో సేద్యం మ‌రింత ఖ‌రీదు వ్య‌వ‌హారం కానుంది.

బ‌డ్జెట్ రాక కార‌ణంగా చాలా విశేషాలు ఈ సారి వెలుగు చూశాయి.ఒక్క‌టంటే ఒక్క కొత్త ప‌థ‌కంకు కూడా ఒప్పుకోని నిర్మ‌లా సీతారామ‌న్ ధ‌ర‌ల త‌గ్గింపుపై కూడా అదే కాఠిన్యం ప్ర‌ద‌ర్శించారు.కేవ‌లం కొన్నివ‌స్తువులు ధ‌ర‌లు త‌గ్గినా కూడా వాటి వ‌ల్ల ఇప్ప‌టికిప్పుడు ఒన‌గూరే ప్ర‌యోజ‌నం అయితే లేదు. వంట నూనెల ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌నున్నాయి కానీ త‌గ్గ‌వు. అదే స్టీల్ ఉత్ప‌త్తులు, రాగి పాత్ర‌లు ఇంకా సోలార్ లాంత‌ర్ల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. బంగారం,వెండి ధ‌ర‌లు బ‌డ్జెట్ ముందే త‌గ్గిపోయాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న‌తో అవి మ‌రింత‌గా త‌గ్గ‌నున్నాయి అని తేలిపోయింది. పెట్రో ఉత్ప‌త్తులు అయితే పెర‌గ‌వు అలా అని త‌గ్గ‌వు. స్థిరీక‌ర‌ణ‌లో ఉంటాయి. అగ్రిసెస్ ఉన్నా ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించిన కార‌ణంగా పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఇక పెర‌గ‌వు అని తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news