GOOD NEWS.. ఓమిక్రాన్ పై సమర్థవంతంగా మోడెర్నా టీకా…

-

ఓమిక్రాన్ పై మోడెర్నా బూస్టర్ డోస్ సమర్థవంతంగా పనిచేస్తుందని సదురు సంస్థ చెబుతోంది. రెండు డోసులతో పోలిస్తే బూస్టర్ డోస్ ఇచ్చినప్పుడు ఓమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేఖంగా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను పెంచుతుందని ప్రకటించింది. 50 మైక్రోగ్రామ్ ల మోడెర్నా టీకా బూస్టర్ డోసు ఇచ్చినప్పుడు న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు 37 రెట్లు మేర పెరిగాయని సదరు సంస్థ తెలిపింది. ఇదే 100 మైక్రోెగ్రాములు బూస్టర్ డోసు ఇచ్చినప్పుడు 83 రెట్లు ఎక్కువగా ఉన్నాయని అని మోడెర్నా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెఫాన్ బాన్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం ఈ ఆందోళనకర, హైపర్ యాక్టివ్ మ్యటెంట్ ఓమిక్రాన్  ఇప్పటికే ప్రపంచంలో 90 పైగా దేశాాలకు విస్తరించింది. గతంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా బ్రేక్ త్రూ ఇన్పెక్షన్లు వస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ సమర్థతపై సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా మోడెర్నా చెప్పిన విషయం కొంత ఉపశమనం కలిగించేదిగా ఉంది. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, ఫైజర్ కూడా ఓమిక్రాన్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుందిని తేలింది. ఇదిలా ఉంటే చైనా తయారీ సినో ఫార్మ్ టీకా మాత్రం ఓమిక్రాన్ ను అడ్డుకోవడంతో బలహీనంగా ఉందని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news