ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కరోనా కట్టడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రజలను ఎప్పటికప్పుడు ఆయన చైతన్య పరుస్తూ ముందుకి వెళ్తున్నారు. జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ అంటూ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు మోడీ. మార్చ్ 22 న సాయంత్రం 5 గంటలకు ఆయన చప్పట్లు కొట్టి వైద్యులకు కృతజ్ఞతలు తెలపాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఆయన మరో టాస్క్ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 5 న దీపాలు వెలిగించాలని కోరిన ప్రధాని మోడీ ఈ సారి తనకు సెల్యూట్ చెయ్యాలని కోరినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మోడీ… ప్రధాని కోసం 5 నిమిషాలు నిలబడి సెల్యూట్ చేయాలన్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని ట్వీట్ చేసారు. తనను వివాదంలోకి లాగడానికి కొందరు అల్లరి మూకలు చేసిన పనిగా మొదట భావించా అని…
కొందరు సదుద్దేశంతో చేసినప్పటికీ వారికి ఒక్కటి చెబుతున్నానన్న మోడీ… నిజంగా నాపై మీకు అంత ప్రేమ, గౌరవం ఉన్నట్లైతే నాకోసం ఈ పనిచేయండని… ఒక పిలుపు ఇచ్చారు. కరోనా సంక్షోభం ముగిసేవరకు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. తనకు ఇంతకు మించిన గౌరవం మరొకటి ఉండదని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.