కరోనా వైరస్ పరీక్షలో గొప్ప పని చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రశంసించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్వైన్ ఫ్లూని ఎదుర్కోవడంలో ఘోరంగా ఫెయిల్ అయిందని ఆయన అన్నారు. “ఇప్పటి వరకు, మేము ఇండియా కంటే ఎక్కువ మందికి కరోనా పరిక్షలు చేసాం. చాల దేశాలు కరోనా పరీక్షలను వేగంగా చేస్తున్నాయి.
భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మేము భారతదేశం కంటే 44 మిలియన్ పరీక్షలు ముందు ఉన్నామని అన్నారు. ఇండియాలో 1.5 బిలియన్ ప్రజలు ఉన్నారని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అన్నారు. మోడీ కరోనా పరిక్షల విషయంలో తనను సలహా కూడా అడిగారు అని అన్నారు. పశ్చిమ తీరంలోని కొన్ని ముఖ్య రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు బిడెన్ అధ్యక్షుడు అయి ఉంటే లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు అని అన్నారు.