ఈఎంఐ సక్రమంగా కట్టే వారికి మోదీ ప్రభుత్వం తీపికబురు..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇక ఈ మహమ్మారి దెబ్బకి కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు ఊరట కలిగించేందుకు లోన్ మారటోరియం బెనిఫిట్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. ఆరు నెలలపాటు ఈఎంఐ కట్టక్కర్లేదని నిపుణులు తెలిపారు. ఇక చాలా మంది కోవిడ్ 19 ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈఎంఐ కట్టకుండా ఉన్నారు. అయితే బ్యాంకులు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారిపై వడ్డీ వసూలు చేస్తున్నాయని తెలిపారు.

cash
cash

ఇక ఈఎంఐ మారటోరియం అంశం సుప్రీం కోర్టుకు వెళ్లిందని తెలిపారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చిందని తెలిపారు. వడ్డీపై వడ్డీ వసూలు చేయబోమని స్పష్టం చేసిందని నిపుణులు తెలిపారు. ఇక సుప్రీంకోర్టు అక్టోబర్ 5న ఈ అంశంపై వాదనలు విననుందని తెలిపారు. ఇక్కడ లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి వడ్డీ భారం పడకపోవచ్చునని నిపుణులు తెలిపారు.

అంతేకాక లోన్ మారటోరియం బెనిఫిట్ పొందని వారి సంగతేంటి మరి. ఇక చాలా మంది ప్రతి నెలా కచ్చితంగా ఈఎంఐ కడుతూ వస్తుంటారు. ఇలాంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగే నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. లోన్ ఈఎంఐ ప్రతి నెలా కచ్చితంగా చెల్లించే కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రూ.2 కోట్ల వరకు రుణాలకు ఇది వర్తిస్తుంది.

ఇక లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి వడ్డీ భారం సౌకర్యం కల్పించినప్పుడు సక్రమంగా ప్రతి నెలా ఈఎంఐ చెల్లించే వారికి అలాగే వదిలేయడం సమంజసం కాదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అందుకని ప్రభుత్వం వీరికి కూడా ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకోచ్చని తెలిపారు.

అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే ఏ నిర్ణయమైన ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇక వడ్డీ మీద వడ్డీ మినహాయింపు ప్రతిపాదనపై సుప్రీం నిర్ణయం తర్వాతనే ఆర్థిక మంత్రిత్వ శాఖ సక్రమంగా.. రుణ ఈఎంఐ చెల్లించే వారికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వ తాజా వడ్డీ మినహాయింపు నిర్ణయంతో రూ.5 వేల నుంచి రూ.7 వేల కోట్ల వరకు భారం పడొచ్చునని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news