ప్రధాని నరేంద్ర మోదీకి , సీఎం కేసీఆర్ లేఖ.. ఆ నిర్ణయం విరమించుకోవాలని వినతి

-

కోల్ బ్లాక్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా రేపటి నుంచి సింగరేణి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలుమార్లు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈనెల 9 నుంచి 3 రోజుల పాటు సింగరేణి వ్యాప్తంగా గనుల్లో సమ్మె సైరన్ మోగనుంది.

తాజగా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సింగరేణి లో కోల్ బ్లాక్స్ వేలాన్ని ఆపేయాలని లేఖలో కోరారు. నాలుగ కోల్ బ్లాక్స్ వేలాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయని కేసీఆర్ లేఖలో తెలిపారు. రేపటి నుంచి సింగరేణి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేఖిస్తూ సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణతో పాటు.. తమ డిమాండ్లను నిరవేర్చాలంటూ కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు. మొత్తం 11 అంశాలపై కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు. నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3,  సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేఖిస్తున్నారు. దీంతో పాటు వేతనాల పెంపు, అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డును నిర్వహించ లేదని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఏడాది కాలంగా మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరిగిందని.. వారికి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news