ఇటలీలో దేశ ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు సూచనలు చేసిన మనలాగే మా దాకా రాదు అని కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం ఇటలీ దేశ పరిస్థితి ఎక్కడపడితే అక్కడ శవాలు పేరుకుపోయి…ఖననం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన గాని చాలామంది ప్రజలు ప్రభుత్వాలకు సహకరించడం లేదు. వాటికి సంబంధించిన వీడియోలు ఎలక్ట్రానిక్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో ఒక్కరి నిర్లక్ష్యం వల్ల దేశమంతా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ప్రభుత్వాలు నాయకులు ఎంత మొత్తుకుంటున్నా గాని ఏమాత్రం ప్రజలను భయాందోళన కనబడటం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే…ఇష్టానుసారంగా ప్రజలు బయటకు వచ్చేసి ఎక్కడపడితే అక్కడ మామూలుగానే క్రికెట్ ఆటలు ఆడుకుంటూ, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
ఇటువంటి నేపథ్యంలో వీడియోలు మరియు దేశ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని చూసిన ప్రధాని మోడీ కి చిరాకు వచ్చినట్లు ఈ సాయంత్రం అత్యవసర నిర్ణయం తీసుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి రావద్దు అని చెప్పిన దండం పెడుతున్నా గాని వస్తున్న నేపథ్యంలో….సరికొత్త చట్టంతో వాళ్లందరినీ నాన్ బెయిలబుల్ ఇలాంటి కేసు ద్వారా అరెస్టు చేయాలని మోడీ డిసైడ్ అవుతున్నట్లు వార్తలు కనబడుతున్నాయి.