కరోనా కోసం మొదటి కిట్, మేడ్ ఇన్ ఇండియా…!

-

మాలిక్యులర్ డయాగ్నొస్టిక్ కిట్లలో ప్రత్యేకత కలిగిన పూణేకు చెందిన మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ సంస్థ మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరు వారాల రికార్డు సమయంలో COVID-19 కోసం మొదటి మేడ్ ఇన్ ఇండియా టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసి సంచలనం సృష్టించింది. ఈ కిట్ ఇండియన్ ఎఫ్డిఎ / సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) నుండి వాణిజ్య ఆమోదం పొందిన మొదటి కిట్ గా నిలిచింది.

అంతేకాకుండా, ఐసిఎంఆర్ పరీక్షల్లో 100 శాతం కచ్చితత్వం సాధించింది. “మేక్ ఇన్ ఇండియా” కు గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో WHO / CDC మార్గదర్శకాల ప్రకారం COVID-19 కిట్ ని అభివృద్ధి చేసారు. అతి తక్కువ సమయంలో దీన్ని అభివృద్ధి చేయడం విశేషం. దీనిపై స్పందించిన మైలాబ్ మేనేజింగ్ డైరెక్టర్ హస్ముఖ్ రావల్ మాట్లాడుతూ…

ఈ జాతీయ అత్యవసర సమయంలో రెగ్యులేటరీ బాడీస్ (సిడిస్కో / ఎఫ్‌డిఎ), ఐసిఎంఆర్, ఎన్‌ఐవి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు, మరియు ఈ చర్యలు ప్రసంశనీయమని ఆయన కొనియాడారు. ఆర్‌టిపిసిఆర్ కిట్‌ల తయారీలో మైలాబ్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది.

మైలాబ్ ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు / ఆసుపత్రులు, క్వాంటిటేటివ్ హెచ్ఐవి, హెచ్బివి మరియు హెచ్సివి వంటి వ్యాధుల కోసం… ఐడి-నాట్ స్క్రీనింగ్ కిట్లను తయారు చేస్తుంది. ఈ తరుణంలోనే కరోనా కోసం కూడా కిట్ తయారు చేసింది. మైలాబ్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి క్లియరెన్స్ కూడా పొందింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) లో మైలాబ్ కోవిడ్ -19 కిట్‌ను పరిశీలించి ఆమోదించారు.

Read more RELATED
Recommended to you

Latest news