దేశం లోనే అత్యంత కీలక లీడర్ ద్వారా చంద్రబాబు నాయుడు కి ఎర్త్ పెడుతున్న మోడి – మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇది ..!!

-

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ లు చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం తగులుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేని విధంగా 23 స్థానాలతో చంద్రబాబుని ప్రతిపక్షంలో కూర్చోపెట్టడం జరిగింది. అటు ఇటు గా సరైన బలం లేని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబుకి పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడి అధికార పార్టీ వైసిపి కి అనుకూలంగా ఉండటంతో పార్టీలో ఉన్న ఇతర నేతలు చంద్రబాబు ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. Image result for chndrbabu modi

బలం లేని ప్రతిపక్షం మరోపక్క జగన్ దూకుడు రాజకీయంతో వయసు మీద పడిన చంద్రబాబు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల దక్షిణాదిలో జరిపిన ఐటి సోదాల్లో తన దగ్గర పనిచేసిన శ్రీనివాస్ చౌదరి వద్ద రెండు వేల కోట్లు విలువచేసే అక్రమ ఆస్తులు గుర్తించినట్లు వచ్చిన వార్తలు మరింత తలనొప్పిని చంద్రబాబుకి తెచ్చిపెట్టాయి. దీంతో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా ప్రధాని మోడీ తీసుకున్నట్లు సమాచారం.

 

గత ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దారుణంగా తనని విమర్శించడంతో చంద్రబాబుని భారీగా రాజకీయ దెబ్బ కొట్టడానికి తాజాగా జరిగిన ఐటీ సోదలలో గట్టిగానే ఎర్త్ పెట్టడానికి మోడీ రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఐటీ అధికారులు జరిపిన సోదలలో చంద్రబాబు వ్యక్తిగత మాజీ కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి దగ్గరనుండి కాంగ్రెస్ పార్టీ నేత అహ్మదా పటేల్ కి ఎన్నికల సమయంలో 400 కోట్లు వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ముందుగా దేశంలోనే అత్యంత కీలక లీడర్ గా పేరుగాంచిన అహ్మద్ పటేల్ ను తగిన ఆధారాలతో ఈ కేసులో బుక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడికి కూడా ఐటి అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు మొత్తం మోడీకి మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇచ్చినట్లు అవుతుందని ఇక టిడిపి పార్టీ కనుమరుగైపోయినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news