కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.

-

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ మొదలయ్యిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల ఈరోజు ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని చూస్తున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో జూన్ 28 నుండి జులై 4వ తేదీ వరకు కరోనా పాజిటివిటీ రేటు 16.2శాతంగా ఉండింది. అది రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. దేశమంతా కేసులు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడం భయాన్ని కలిగిస్తుంది. అదే కాదు కొత్త వేరియంట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతాయన్న వార్తలు ముందే అప్రమత్తం కావాలని తొందరపెడుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 37,154 గా ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news