ఇరాక్: అర్థరాత్రి కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం. పేపెంట్ల అంతా గాఢ నిద్రలో ఉండగా ఆస్పత్రిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే అన్ని వార్డులకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకునేలోపే ప్రాణ నష్టం జరిగిపోయింది. 52 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన ఇరాక్ సిటీ నాసిరియాలోని అల్-హుస్సేన్ ఆసుపత్రిలో జరిగింది. ఈ ఆస్పత్రిలో మొత్తం 70 పడకలతో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఇరాక్ ప్రధాన మంత్రి ముస్తఫా అల్-కధేమితో పాటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని ట్వీట్ చేశారు.
رئيس مجلس الوزراء القائد العام للقوات المسلحة @MAKadhimi يعقد اجتماعاً طارئاً ضم عدداً من الوزراء والمسؤولين والقيادات الأمنية؛ وذلك للوقوف على أسباب حادثة حريق مستشفى الإمام الحسين (ع) في محافظة ذي قار، ومعالجة تداعياتها، وقد خرج الاجتماع بالقرارات الآتية: pic.twitter.com/dgAQdj0iEq
— المكتب الإعلامي لرئيس الوزراء 🇮🇶 (@IraqiPMO) July 12, 2021