బరువు నుండి షుగర్ వరకు ఎన్నో సమస్యలని జొన్న రొట్లుతో కంట్రోల్ చేసుకోండి…!

-

జొన్న రొట్టెలు(Jowar) ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న రొట్టెలు తినడం వల్ల ఎన్నో సమస్యల్ని తొలగించుకోవచ్చు. ప్రతి రోజు డైట్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు. మరి జొన్న రొట్టెలు వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న రొట్టెలు | Jowar

జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇది డైజెషన్ కి బాగా సహాయపడుతుంది కడుపు నొప్పి మొదలైన సమస్యలు నుండి కూడా రక్షిస్తుంది.

జొన్న లో ఏమేమి ఉంటాయి..?

జొన్న లో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. అంటే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్ బి కాంప్లెక్స్ మొదలైనవి ఉంటాయి. అదే విధంగా ఇందులో పొటాషియం, క్యాల్షియం మరియు ఐరన్ కూడా వుంటాయి. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

జొన్న రొట్టెలు తినడం వల్ల కలిగే లాభాలు:

బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రమోట్ చేస్తుంది:

జొన్నలో ఐరన్, కాపర్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్లడ్ సర్కులేషన్ కి సహాయపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది.

బరువు తగ్గొచ్చు:

జొన్న రొట్టె లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండి పోయేటట్టు చేస్తుంది కాబట్టి జొన్నరొట్టెలని డైట్ లో తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

జొన్న లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఇది క్యాలిషియంని అబ్సర్బ్ చేసుకుంటుంది. తద్వారా బోన్స్ దృఢంగా ఉంటాయి.

డయాబెటిస్ వాళ్లకి ఉపయోగకరం:

జొన్నలని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వాళ్లకి చాలా మంచిది. ఇన్సులిన్ లెవెల్స్ ని గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటెన్ చేస్తుంది కాబట్టి ప్రతి రోజూ మీ డైట్ లో దీనిని తీసుకోండి తద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news