పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు వర్చువల్ తరహాలో ప్రారంభించనున్నట్టు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఒక అధికారిక ప్రకటనలో తెలిపిది. పూరీ స్టేషన్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు. వర్చువల్ తరహాలో మధ్యాహ్నం 1 గంటకు మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. పశ్చిమబెంంగాల్‌కు కేటాయించిన రెండో వందే భారత్ రైలు ఇది కావడం విశేషం.
ఈ రైలు హౌరా, పూరీల మధ్య 500 కి.మీ దూరాన్ని ఆరున్నర గంటల్లో చేరుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఉదయం 5:50 గంటలకు బయలుదేరి 11:50 గంటలకు ఒడిశాలోని పూరీకి చేరుకుంటుంది. వందే భారత్ మధ్యాహ్నం 2 గంటలకు పూరిలో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హల్దియా స్టేషన్‌లో ఆగనుంది.