రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుదనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. కర్ణాటకలో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో లేవన్న మంత్రి.. అక్కడ కాంగ్రెస్ కు ప్రత్యమ్నాయం లేదన్నారు.
రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధితో రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ర్టానికి చేసిన అభివృద్ధిని చూసి దేశ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని దేశమంతటా గెలిపించాలని చూస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని, ఒకపక్క సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే మంత్రి కేసీఆర్ ఐటీ రంగాన్ని విస్తరింపజేసి లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇంటి పార్టీగా మారి పెద్ద బలగం తయారైందన్నారు. బీఆర్‌ఎస్‌ని ఢీ కొట్టేసత్తా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేదన్నారు.