మొహాలీ వన్ డే: ఇండియా ఆస్ట్రేలియాను వణికిస్తుందా ?

-

ఆస్ట్రేలియా మరియు ఇండియాలు వన్ డే వరల్డ్ కప్ కు పాల్గొనబోతున్న చివరి సిరీస్ గా మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ నిలవనుంది. ఇండియా లోని మూడు వేదికలలో ఆస్ట్రేలియా మూడు వన్ డే లను ఆడనుంది. అందులో భాగంగా మొదటి వన్ డే మొహాలీ వేదికగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఐసీసీ వన్ డే ర్యాంకింగ్ లలో ఇండియా రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కనుక ఇండియా గెలిస్తే మొదటి స్థానంలో ఉన్న పాకిస్తాన్ ను వెనక్కు నెట్టి నెంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంటుంది. ఇది జరగడం అంత ఆషామాషీ విషయం కాదు.. ఇండియా ఆస్ట్రేలియా లు అన్ని విభాగాలలోనూ చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా బత్నిగ్ , బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లలో కమాండింగ్ పోసిషన్ లో ఉందని చెప్పాలి. కానీ ఇండియాకు కలిసొచ్చే ఒకే ఒక విషయం ఏమిటంటే… ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన అయిదు వన్ డే ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2 – 3 తేడాతో ఓటమి పాలయింది.

ఓడిపోయినా మూడు మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియా సెకండ్ బ్యాటింగ్ కావడం విశేషం. మరి ఈ రోజు ఇండియా ఒకవేళ టాస్ గెలిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ఇక ఆసియ కప్ లో ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ ను గెలుచుకుంది.. ఇదే జోరు మీద ఆస్ట్రేలియాను కూడ వణికిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news