అవసరం అనుకుంటే పీఎఫ్ అకౌంట్ వున్న ప్రతీ ఉద్యోగి కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ డబ్బులు ఎన్ని సార్లు తీసుకోవాలి..?, ఎప్పుడు తీసుకోవాలి..? అనేది చాల మందికి తెలియదు. ప్రావిడెంట్ ఫండ్ మన ఫ్యూచర్ డిపాజిట్స్. రిటైర్మెంట్ కోసం వీటిని మనం దాచుకోవాలి. కానీ తప్పదు అనుకుంటే పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్ పీఎఫ్ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ కల్పిస్తోంది. దీనికి మీరు ఎందుకు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటున్నారో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.
జాబ్ పోయినా మీరు ఈ కారణంతో డబ్బులు పొందొచ్చు లేదా పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం వంటి వాటికి కూడా తీసుకోచ్చు. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న పూర్తి డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి అవ్వదు అని గుర్తుంచుకోండి. మీ ఉద్యోగం పోయినప్పుడు, రెండు నెలల నుంచి జీతం రావకపోయిన సరే డబ్బులు పూర్తిగా విత్‌డ్రా చేసుకోచ్చు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పీఎఫ్ అకౌంట్‌లోని 75 శాతం మొత్తాన్ని లేదా మూడు నెలల మొత్తం, డీఏకు సమానమైన డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక ఎన్ని సార్లు ఈ డబ్బులు తీసుకోచ్చు అనేది చూస్తే…. పిల్లల చదుదు కోసం అయితే పీఎఫ్ అకౌంట్ నుంచి మూడు సార్లు డబ్బులు విత్‌డ్రా చెయ్యచ్చు. ఇల్లు లేదా ప్లాట్ వంటి వాటికి అయితే ఒకసారి మాత్రమే. మెడికల్ ఎమర్జెన్సీ కింద ఎన్ని సార్లు అయినా డబ్బులు తీసుకోవచ్చు. కానీ ట్యాక్స్ రూల్స్ చూసుకోండి.