తెలంగాణలో మంకీపాక్స్ టెన్షన్

-

తెలంగాణలో మంకీ పాక్స్ కేసు కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి (35) మంకీ పాక్స్ లక్షణాలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రానికి చెందిన అతడు ఈనెల 6న కువైట్ నుంచి తెలంగాణకి వచ్చాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతని శరీరంపై దద్దుర్లు కూడా రావడంతో ట్రీట్మెంట్ కోసం ఆదివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్ అనుమానంతో జిల్లా ఆసుపత్రికి పంపారు. అయితే మంకీ పాక్స్ లక్షణాలుగా అనుమానించి హైదరాబాద్ వెళ్లాలని అతడికి సూచించారు.

మంకీ పాక్స్ అనుమానిక లక్షణాలు కనిపించడంతో అతడికి టెస్ట్ నిర్వహించారు. అయితే నేడు ఆ మంకీ పాక్స్ అనుమానాస్పద కేసు రిజల్ట్ రానుంది.బాధితుడికి హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది.పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు బాధితుడి సాంపిల్ ని పంపించారు.నేడు సాయంత్రం వరకు శాంపిల్ టెస్ట్ రిజల్ట్స్ రానున్నాయి. బాధితుడుతో ఉన్న ఆరుగురు కాంటాక్ట్ పర్సన్స్ ని ఇప్పటికే గుర్తించారు. వారిని, బాధితుని కుటుంబ సభ్యులను ఐసోలేషన్ లో ఉంచారు. ప్రస్తుతం మంకీ పాక్స్ అనుమనితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news