తెలుగు రాష్ట్రాల్లో 48గంటల పాటు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు పొంగుతున్నాయి. రానున్న 48గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో భారీ, అతిభారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. అంతే కాదు గంటకు 30నుండి 40కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో చాలా జిల్లాల్లో భారీ నుండి మొదలుకుని అతిభారీ వర్షాలు కురవనున్నాయని, కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాల నుండి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు భారీగా ఉండనున్నాయి. అలాగే సముద్రమట్టం నుండి 3.1కి.మీ నుండి 7.6కిమీ వరకు ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ళలోనే ఉండాలని, బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసారు.