అమరావతి: కరోనా నేపథ్యంలోనూ ఏపీలో సంక్షేమ పథకాలు ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతోంది. ఇవాళ కాపులకు చెందిన పేద మహిళల ఆకౌంట్లలోకి నిధులు జమచేస్తున్నారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన కాపు నేస్తం కింద రూ. 15 వేలను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదలను చేయనున్నారు. వర్చువల్ విధానంలో ఈ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
40 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలు ఉన్న అర్హులైన మహిళలకు ఈ డబ్బులు జమ కానున్నాయి. ఈ కాపు నేస్తం పథకం కింద మొత్తం 3,27,244 మంది మహిళలు లబ్ధిపొందనున్నారు. మొత్తం రూ. 490.86 కోట్లు వారి అకౌంట్లలోకి చేరనున్నాయి. వరుసగా రెండోసారి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు. ఐదేళ్ల పాటు వారికి సంవత్సరానికి రూ. 15 వేలు చొప్పున మొత్తం ఐదేళ్లలో రూ.75 వేలు లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది. గత ఏడాది రూ. 400 కోట్లను జమ చేసింది.