త్వరలోనే పలుకరించనున్న తొలకరి జల్లులు..

-

ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1న ఇవి కేరళను తాకుతాయి. ఈసారి కాస్తంత ముందుగానే అంటే ఈ నెల 27నే కేరళను తాకుతాయని వాతావరణశాఖ అధికారులు ఇటీవల అంచనా వేశారు. అయితే, అవి ఇంకాస్త ముందుగానే అంటేఈ నెల 25నే రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నిన్ననే విస్తరించాయి రుతుపవనాలు.

IMD, Skymet predict early monsoon arrival on Kerala coast | The Financial  Express

గత రెండు మూడు రోజులుగా కేరళ, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే ఐదు రోజులు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ.

Read more RELATED
Recommended to you

Latest news