తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండగా.. ఇప్పుడు పెంచిన వాటితో ఇది 46 లక్షలకు చేరుతుందన్నారు. పాత, కొత్త పెన్షనర్లకు బార్ కోడ్ లతో కొత్త పుస్తకాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ లకు ప్రస్తుత సహకారం కొనసాగిస్తూనే కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
డయాలసిస్ పేషెంట్లకు రూ. 2016 రూపాయలు రూపాయలు ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆగస్టు 15 నుంచి పెన్షన్ ఇస్తామని ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ పాలనలో అభివృద్ధి సాధ్యమని.. మరోసారి టీఆర్‌ఎస్ విజయం ఖాయమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
Governance with a humane face has been the Hallmark of Sri #KCR Garu’s administration;
From 15th Aug❇️ 10 Lakh New pensions
❇️ Monthly pension of ₹2,016 to Dialysis patients besides free dialysis at Govt hospitals
❇️ Reservations to Orphan children in Education & Employment
— KTR (@KTRTRS) August 8, 2022