మోర్బీ బ్రిడ్జి ఆధునికీకరణకు రూ.2 కోట్లు.. ఖర్చు చేసింది మాత్రం..

-

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. యువకుల అత్యుత్సాహం వందల మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే బ్రిడ్జి ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించగా.. నిర్వహణ సంస్థ అయిన ఒరేవా గ్రూప్‌ అందులో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. కేటాయించిన మొత్తంలో కేవలం 6 శాతం నిధులను వినియోగించిందని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. తూతూ మంత్రంగా పనిచేసి తీగలకు రంగులేసి, మార్బుల్స్‌ను పాలిష్‌ చేసి మరమ్మతులు పూర్తయినట్లుగా చూపించారని తెలుస్తోంది.

దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్‌ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరవచ్చని ఒరేవా గ్రూప్‌ ఛైర్మన్‌ జైకుష్‌ పటేల్‌ గత నెల 24న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ.. పర్యాటకులను బ్రిడ్జిపైకి అనుమతించింది. ఈ క్రమంలో గత నెల 30న కేబుల్ బ్రిడ్జి కుప్పకూలడంతో 135 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news