ఫస్ట్ కాజ్ : ప్రముఖ సాహితీవేత్త అబ్బూరి ఛాయాదేవి స్మరణలో
జూన్ 28,2019లో కనుమూశారామె.
సారస్యాన్ని గుర్తించిన స్వానుభవం
పేరెన్నిక గన్న జ్ఞాన సుగంధం
జీవాత్మ కూడికకు అందివచ్చిన సందర్భం
అవును ఇవే మరణానంతరం వినగ వస్తాయి – కానగవస్తాయి
అవునవును ఇవే నిక్షిప్త దేహ పాత్రలో దోగాడుతాయి
ఈ తరహా సిద్ధిని ప్రేమిస్తే బుద్ధి వికసిస్తుంది..
మరణానంతర బాధ్యత అంటే ఇదే..
కైవల్య సిద్ధి అంటే ఇదే..
నాథ హరే జగన్నాథ హరే!
అన్నట్లు వీధిలోకి దేవుడు వచ్చే సమయం ఆసన్నం అయింది
ఉండండి పలకరించి వస్తాను…హాహాహా..
మనుషులు చేసిన దేవుడి దగ్గర భక్తి వ్యుత్పత్తి
దేవుడు చేసిన మనుషుల దగ్గర భక్తి ఉత్పాతం
ఆ..ధూళి మేఘావరణం దగ్గర మీరూ/నేనూ చిన్నవారం..
బడి దారుల్లో అమ్మా నాన్నా కానగవస్తారు.కైవల్య సిద్ధి అంటే ఏంటని అడిగేను అమ్మను నవ్వారు..మాటలకూ మౌనానికీ మధ్య అమ్మ ఉండిపోయారు.ప్రేమ కు పరిపూర్ణత లేదు సరే కనీసం పరిపక్వత కూడా కొన్నింట లేదు ఎందుకని నాన్నని అడిగేను.బాధ్యతను విడిచిపోయిన నాన్నను మరోమారు అడిగేను.. మీ ప్రేమలో మీ అనుకునేవారికి పంచిన ప్రేమలో ఉన్నది పరిపూర్ణతా లేకా ప రిపక్వతా అని!మన జీవితాల్లో ఇలా ఎన్నో సందేహాస్పద సందర్భాలను విడిచి హాయిగా జీవించేస్తున్నాం.లెక్కలు కొన్ని జాతకాలను తేలుస్తాయి అని విన్నా ను..అవును చుక్కల లెక్కలు అని ఒకరు చెప్పారు నాతో..అన్నీ అలానే సా ధ్యమా..ఆ..కూడికను ఆ కూడలిని నేను ద్వేషించాను..జాతకాల జావళి ఇది అని కవి అంటే నవ్వే ను..ఏదో ఒక తప్పించుకునే మార్గం దగ్గర మనుషులు అంతా ఇలాంటివి నమ్ముతారు.కనుక చేతి రేఖలో నుదుటి రేఖలో చచ్చాక కూ డా మన గతిని కాదు మనవారి మారుస్తున్నాయా??హాహాహా..ఈ శూన్య స్థా వరాల చెంత మనిషి,ఓ..దిగ్భ్రమ రూపం..అవును ఇలాంటి భ్రామక పదార్థాల ను మనం అంతిమంగా చూసి, అంతిమంలోనే మరిచిపోతాం.అవును!తిరుగా డే ఆత్మలు,దోగాడే చింతనలను మనం చూశామా లేదు కదా!అవి అనుజ్ఞనో – ఆజ్ఞనో ఇస్తే కనీసం పాటించామా లేదు కదా!మరణానంతర బాధ్యత నిర్వర్తించ డం అంటే ఇదే! దేహాత్మల పరిభాషలను అర్థం చేసుకోవ డం ఎంత కష్టమో..ఒ క అనుభవం తప్పక నేర్పిస్తుంది.కనుక ఒక ప్రతిపాదన అనుసారం లేని ఆత్మ ఉన్న ఘోష ఈ రెండూ ఇలానే..ఎలానో!
ఇవ్వడం అనే బాధ్యత కొసరి కొసరి తీసుకున్నాకనే తెలియడం నిజంగానే నిజం గానే నాకో వింత .. ఒకపరి ప్రేమ ఒకపరి సంతోషం ఇవ్వడం అనే చర్య మమత ల్లో దాగి పోతే ఎంత బాగుండు.మమతల రూపేణా పంచిపోతే ఎంత బాగుండు. అవును ఆరడుగుల్లో దాగిపోవడం మరణం..ఆరడుగుల్లో వెలిగిపోవడం మరణం ..అవును వెలుగే మరణం చీకటి జననం..అవును పుట్టకను భ్రాంతికి పరిమి తం చేసి స్వీయ వికాసాన్ని మరణం దా కా తోడ్కొని వెళ్లడం ఇక్కడెవ్వరూ చే యని పని.. చేయ కూడదు అనుకున్న పని.కనుక వికాస దారులు మరణిం చాక కూడా కొందరికి తోడ్పాటు అందించవు..కనుక అన్ని మరణాలూ మేలైన వి కావు..విశాల క్రాంతి దర్శనం కొన్ని మరణాల తరువాతే సాధ్యం..అటువంటి గుర్తింపునో లేదా గమనికనో పరిగణనలో తీసుకోవడమే బాధ్యత.
మరణించిన వారి గొంతుకలనుమరణించాకనే గుర్తించి గౌరవించడం అనే సంప్ర దాయం దేశాన బాగా ప్రబలుతోంది.బాగుంది ఇలాంటి చర్యలే సాహితీ వన వి కాసానికి, జన జాగృతి పరిణామానికి ఉపయోగపడుతున్నాయేమో!మరణిం
నాడుల స్పందనల్లో కొద్దిగా కూడా తేడా ఏమీ అనిపించడం లేదు.గుండె గదు లకూ ఈ పాటి దాపరికం చేతకావడం లేదు.దాచిపెట్టడం అన్నది జ్ఞాపకాల వి షయమై అన్నింటా జరగని పని.. ఇంట కొన్ని పటాలు..బయట కొన్ని పటా లాలు వెలుస్తూనే ఉంటాయి.కానీ ఆ కాంతిని నిష్క్రియగా భావించడం కొందరికి వల్ల కాని పని.అవును అవి నా వరకూ గొడ్డు మోతు మోఘాల పరంపరకు చెందినవే అయి ఉంటాయి.అవును మనిషి పంచిన జ్ఞాన పరంపర పుస్తకాల్లో దాగుండడం నాకెందుకో నచ్చని పని..ఆ పనితో మన చర్యలు ముగిసిపోతా యి.మన నివాళి సంప్రదాయం అక్కడితో ఆగిపోయి చేయదగని పనులేవీ చే యనీయక ఆగిపోవడం అక్కడి నుంచే మొదలయ్యేలా చేస్తుందా చర్య.అవును చనిపోయిన వారి దారి చరితాత్మకం కావాలని రూలేం లేదు.అసలీ రూలింగ్ నూ,రైమింగ్ నూ,టైమింగ్ నూ నమ్మకూడదు.కూడు పెట్టనివి కొన్నిఉన్నా అవి పొట్టకు హాయినివ్వవు మనస్సుకు హాయిగా తోస్తాయి. కానీ మనం మెదడుకు మనస్సుకు పనికి వచ్చే పని ఏ నాడయినా చేశామా లేదు కదా!కనుక కూడు పెట్టే పనులు ఈ స్మారక నిర్మాణాలు కావు. మెదడుకు పని పెట్టే పనులు ఆ పుస్తకాల అచ్చుపోత అంత కన్నా కాదు..ఏం చేయాలో చెప్పి చావరాదు చ చ్చాక అవే తెలిసివస్తాయి..నిద్రాణంగా దాగే చర్యలు ఇతరులతో అమలుకు నో చుకోవచ్చు..కనుక ప్రేరణ సహిత చర్యలను ప్రేమించా లి.పూనిక వహించిన చ ర్యలలో ఎవరిని వారు వెతుక్కోవాలి. నిద్రాణంగా ఉండిపోవడం అంటే ఇదే..కా నీ చేస్తున్నామా మనం.. చెప్పానుగా..చము రు దీపాల వెలుగుల్లో మనుషు లు వెలిగిపోవడం అత్యంత బాధాకరం అని! కూడు పెట్టనవి ఇవే!కొన్ని దేహాల కొంపలకు ఇంత నీడనివ్వనివీ ఇవే! కనుక ఈ తరహా చర్యలను నిషేధించాలి. ఈ తరహా పనులు వద్దనుకోవాలి.దేహపు చావిళ్లలో కొన్నింటిని పదిలం చేసు కునే పని..ముందరి మను షులు వదిలి పెట్టిన వాటిని పూర్తి చేయడంతోనే ఆ రంభం కావాలి. వదిలి పెట్టింది కథో కవిత్వమో కాదు కొన్ని అసంపూర్ణ చర్యలు అని..అవి కదా! కావాలి..కనుక సంబంధిత అచ్చుని నిషేధించి అచ్చెరువుగా తోచిన పనేదో చేసుకుని పోవాలి.అందుకనో/ఎందుకనో నివాళి అనే పదం నాకో అబద్ధం.
కొన్ని చినుకుల పలకరింపుల్లో స్మారకాలను సందర్శించాను.స్మారక స్థావరా ల్లో ఎవరెవరినో వెతికాను.స్మారకం ఉన్న చోట చీకటి లేనిచోట వెలుగు..అవు ను భౌతికం చీకటి అని అనిపించింది.అవును ఆ కంటికి కనిపించని వెలుగే జీవి తాలకు అతి ముఖ్యం.కానీ ఈ చీకటి ని ఈ గుర్తింపునీ ఈ ప్ర భనూ చూసి ము రిసిపోవడం జీవితాంతం చేస్తూనే ఉంటాం. అవును క్రమయుగ్మ కూడలిలో సు ఖం వాటా ఎక్కువగా ఉండాలని కోరుకుంటు న్నాం.ద్వంద్వం వర్థిల్లితే ఏకాం తం/ఏక స్వరం/ఓ మధురిమను మోసుకువస్తాయని అనుకోవడం భ్రమ.కానీ మనం భ్రమలను ప్రేమించే పని తప్పక చేయాలనుకుంటున్నాం కదా!అందుకే మరణానంతరం జీవుడి పుట్టుకను అవశ్యం గుర్తించం.అవును!వాడే పుడతా డు..దుఃఖంగా పుడతాడు..పాటగా పుడతాడు ..చుక్కల్లో మెరుస్తాడు..వేగుచు క్క పాటలా అవతరిస్తాడు..ఆ అవతారికను గుర్తించడమే ఇప్పటి బాధ్యత.
చిమ్మ చీకట్ల దారులన్నీ కొన్ని ప్రాణస్వరాలను నింపుకుంటున్నాయి.వెలుగు పూల వికాసాలన్నీ కొన్ని ప్రాణ స్వరాల వెలివేతల్లో ఉంటున్నాయి.జీవ గొంతు కకు భాష్యం రాయడం సులువయిన పని అని ఆమె అన్నారు.నవ్వాన్నేను.ఈ వికసిత లక్షణం ఏ చోట కూడా లేదు కదా అని నవ్వా న్నేను.ప్రమాద గంటిక లు మోగుతున్న ప్రతి సందర్భం అప్రమతత్తను సంకేతిస్తే గుర్తు చేసే బాధ్యత తోటివారిది కానవసరం లేదు. తోడున్న వారిదీ కానవసరం లేదు. జాగ్రత్త.. స్వీ య స్పృహ అన్నవి జన్మాంతం దాకా తోడుగా పెట్టుకోవాలి.ఈ వస్తువులను భ ద్రపరుచుకోవడం చేతకావాలి.కనుక భద్రత జీవితాన ప్రథమ కర్తవ్యం అని ఎవ్వ రు అన్నా ఒప్పుకోను.అంతకుముందరి జాగురుకతే ముఖ్యం కదా అని భావి స్తాను.చెరశాలల్లాంటి జీ వితాలను ఇచ్ఛకు స్వేచ్ఛకు దగ్గర చేయాలనుకోవడం మనం చేస్తున్న పని. కానీ కోరిక రద్దయ్యాక జీవితం బాగుంటుంది. స్వేచ్ఛ రద్ద య్యాక ఆ లోచనల యుద్ధం మొదలవుతుంది.కనుక బంధీఖానాను ప్రేమించా లి.విషాదాన్ని ప్రేమించాలి. ఏమీ లేని తనాన్ని ప్రేమించాలి. చెప్పానుగా నాలా నో/మీలానో/మీకు..మీరుగానో/నా వరకు – నాకు నేనుగానో ఆగిపోవడం ఇష్టం గా సాగిపోవాలి.కానీ ఇలా జరుగుతుందన్న రూఢీ ఇవ్వలేను.తత్ సంబంధిత హామీ ఇవ్వలేను.
– రత్నకిశోర్ శంభుమహంతి