నిమిషానికి 1140 చప్పట్లు కొట్టి గిన్సిన్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్న యువకుడు..

-

ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. గిన్సిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాలనే కల చాలామందికి ఉంటుంది. దానికోసం..క్రేజీగా ఏవేవో చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసి కొడతాయి.. మరికొన్నిసార్లు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా ఓ యువకుడు..గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం.. చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొడితే ఇచ్చేస్తారా అనుకుంటున్నారా.. అతను నిమిషానికి ఎన్ని చప్పట్లు కొట్టాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా 1140 చప్పట్లు. అంటే సెకనుకు 19 చప్పట్లు. ఇలా చేయడం అందరి వల్ల సాధ్యం అయ్యేపని కాదు.

అతని పేరు డాల్టన్ మేయర్. వయసు 20 ఏళ్లు. అమెరికాలో నివసిస్తున్నాడు. అతనికి సహజంగానే చప్పట్లు వేగంగా కొట్టడం వచ్చు…దాని కోసం తాను ఏమీ ప్రాక్టీసు చేయలేదట. ఒకసారి యూబ్యూబ్‌లో కేట్ ఫ్రెంచ్ వీడియోను చూశాడు. కేట్ అత్యంత వేగంగా చప్పట్లు కొట్టి రికార్డులెన్నో సాధించాడు.
అప్పుడే.. డాల్టన్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలని అనిపించింది. కేట్ కన్నా ఎక్కువ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి నిమిషంలో అత్యంత ఎక్కువ చప్పట్లు కొట్టిన వ్యక్తిగా బిషప్ అనే వ్యక్తి పేరు మీద గిన్నిస్ రికార్డు ఉంది. దాన్ని అధిగమించాలని ఫిక్స్‌ అయ్యాడు. బిషప్ నిమిషానికి 1103 కొట్టి రికార్టుకెక్కాడు. అంటే డాల్టన్ అంతకన్నా ఎక్కువ కొట్టాలి.

ఇంతకీ ఎలా లెక్కపెట్టారు?
సెకనుకు 19 చప్పట్లు కొట్టటం అంటే.. మామూలు విషయం కాదు, వాటిని లెక్క పెట్టడం కూడా మాములు విషయం కాదు. ఇల్లినాయిస్‌కు చెందిన ఓ మీడియా గ్రూప్ ఫోటోగ్రఫీ పరికరాలతో డాల్టన్ చప్పట్లు కొడుతుంటే చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను స్లో మోషన్లో వేసి చప్పట్లు లెక్క పెట్టారట.. దీనికి చాలా సమయం పట్టింది. ఆ వీడియోలను గిన్నిస్ బుక్ వారు దగ్గరుండి పర్యవేక్షించారు. లెక్క కట్టుకున్నాకే డాల్టన్‌కు రికార్డును అందించారు గిన్నిస్ రికార్డు వారు. మొత్తానికి ఆ యువకుడు తనకు వచ్చిన పనిమీదే కాస్త శ్రద్ధ పెట్టి అనుకున్నది సాధించాడు..

Read more RELATED
Recommended to you

Latest news