ఎక్కువ మందికి తరచుగా ఇవే కలలు వస్తాయట.. ఫలితాలు ఎలా ఉంటాయంటే

-

కలలు సహజం. మీకు మంచి కలలు వచ్చినా, చెడు కలలు వచ్చినా అవన్నీ భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలే. మనకు ఏవేవో కలలు వస్తాయి. కానీ మనకు వచ్చిన కలకు అర్థం ఏంటో తెలుసుకోవాలని ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. కలల వాస్తవికతను అర్థం చేసుకోవడానికి స్వప్న శాస్త్రం ఉపయోగపడుతుంది. ఈరోజు మనం తరచుగా వచ్చే కొన్ని కలల అర్థాలు ఏంటో చూద్దాం.

ఒక వ్యక్తి చిరిగిన పాత బట్టలతో కలలో తనను తాను చూసినట్లయితే ఈ కల అతనికి చాలా చెడ్డది. దాని ప్రభావాలను వదిలించుకోవడానికి వెంటనే సూర్య భగవానుని పూజించడం ప్రారంభించాలి.

ఆవు, సింహం లేదా ఏనుగుతో తనను తాను చూడటం చాలా మంచిదని భావిస్తారు. ఈ కల ద్వారా మీరు దేవుని ఆశీర్వాదం పొందుతారు.

dream

మీకు కలలో యజ్ఞం కనిపిస్తే, ఈ కల ప్రభావాల నుండి బయటపడటానికి, మీరు గంగా లేదా మరేదైనా పవిత్ర నది ఒడ్డున కూర్చుని యజ్ఞం చేయాలి.

మీకు రాజభవనాలు, కోటలు లేదా ఎత్తైన పర్వతాలు కలలో కనపడితే అప్పుడు అది చాలా శుభప్రదం. మీ జీవితంలో త్వరలో ఆనందం, శ్రేయస్సు రాబోతుందని అర్థం.

ఆవు పేడ, వెంట్రుకలు, పొడి గడ్డి, బూడిద, విరిగిన పాత్రలు, కలలో మానవ లేదా జంతువు యొక్క మృతదేహం కనిపిస్తే చెడ్డ శకునం. మీరు ఏదైనా ప్రయాణం చేయబోతుంటే విరమించుకుని విష్ణువును పూజించండి.

కలలో పామును చంపడం లేదా హింసించడం, పెళ్లికి హాజరు కావడం, మాంసాహారం తినడం ఇవన్నీ చెడు కలలు.

ఒకరి మరణం గురించి కలలు వస్తే చాలా మంచిది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.

కలలో చేపలు కనపడితే.. ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అదే మాంసం తిన్నట్టుగా వస్తే.. మీకు గాయాలు అవుతాయని అర్థం.

కాళ్లు, చేతులు కడుగుతున్నట్టుగా కనిపిస్తే.. మీకున్న అన్ని దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.

కలలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టుగా అయితే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో పాలు తాగుతున్నట్టుగా కనిపిస్తే.. అదే ఫలితం ఉంటుంది. నీరు తాగుతున్నట్టుగా కనిపిస్తే.. ఐశ్వర్యం రాబోతోందని అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news