ఆక్రమణల తొలగింపులో అపశ్రుతి.. గుడిసెకు నిప్పంటుకుని తల్లీకుమార్తెలు సజీవదహనం

-

ఉత్తరప్రదేశ్​లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకోవడం వల్ల తల్లీకూతుళ్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఆక్రమణల తొలగింపునకు వచ్చిన అధికారులై గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించుకున్న స్థలంలో గుడిసెను నిర్మించారనే కారణంతో బాధిత కుటుంబంపై అధికారులు దాడి చేశారని.. కావాలనే గుడిసెకు నిప్పంటిచారని చెబుతున్నారు.

కాన్పుర్ దేహత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రూరల్ పోలీసు స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్న కృష్ణ గోపాల్​ గుడిసె మంటల్లో కాలిపోయింది. ప్రమాదంలో కృష్ణ గోపాల్​ భార్య.. ప్రమీలా దీక్షిత్, అతని కూతురు నేహ మంటల్లో సజీవ దహనం అయ్యారు. కృష్ణ గోపాల్​ తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం రోజున అక్రమంగా గుడిసెను నిర్మించారని వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కృష్ణ గోపాల్​ స్థలాన్ని ఖాళీ చేయనందు వల్లే అధికారులు గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు చెబుతున్నారు.

అంతకుముందే ఈ స్థలం సమస్యపై జిల్లా కలెక్టర్​ను ఆశ్రయించామని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్​ వారికి హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ, ఇంతలోనే ఈ విషాదం జరిగిందని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news