రేవంత్ హామీల వర్షం..కాంగ్రెస్‌కు కలిసోచ్చేనా!

-

ముచ్చటగా మూడోసారి కూడా ఓటమి పాలైతే..ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఆగమ్యగోచరంగా మారుతుందని చెప్పవచ్చు. ఇంకా ఆ పార్టీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత వరుసగా రెండుసార్లు ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. పైగా కేసీఆర్..కాంగ్రెస్ పార్టీ నేతలని వరుసపెట్టి లాక్కుని ఇంకా పార్టీని వీక్ చేశారు. అటు పార్టీలో అంతర్గత విభేదాలు ఇంకా ఇబ్బందిగా మారాయి.

ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న పార్టీకి ఊపిరి పోసేందుకు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విజయవంతంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుండగా, పాదయాత్రలో ప్రజలని కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అదే సమయంలో రేవంత్ పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. తాజాగా మణుగూరులో రేవంత్ పాదయాత్ర జరిగింది..అక్కడ భారీ సభలో కీలక హామీలు ఇచ్చారు. ఎన్టీఆర్ 9 నెలల్లో ఎలా టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారో.అదేవిధంగా 9 నెలల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.

May be an image of 4 people, people standing and train

అలాగే పోడు భూముల విషయంలో కే‌సి‌ఆర్ సర్కార్ పదే పదే మోసం చేస్తుందని, 9 ఏళ్ళు చేయలేనిది..9 నెలల్లో పోడు పట్టాలు ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పుకొచ్చారు.

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ రూ.500లకే అందిస్తామని చెప్పారు. ఇటు బి‌ఆర్‌ఎస్ అటు బి‌జే‌పి..రెండు పార్టీలు తోడు దొంగలే అని అన్నారు. మొత్తానికి రేవంత్ పాదయాత్ర చేస్తూ హామీలు ఇస్తూ వెళుతున్నారు. మరి ఈ హామీలని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు..ఈ మేరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్ధతిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news