విషాదం : రిక్షాలో కొడుకు మృతదేహం తరలింపు

-

నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ఘోర , బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన తన కుమారిని మృతదేహాన్ని తల్లి రిక్షాలో ఇంటికి తీసుకెళ్లారు. పార్వతీపురం సోని వైకేఎం కాలనీకి చెందిన కిషోర్ అనే ఒక యువకుడు అనారోగ్యం పాలయ్యాడు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కిషోర్ శ్వాస విడిచాడు. దీంతో తన కుమారుడు కిషోర్‌ను అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు తల్లి ఆర్థిక స్థోమత సరిపోలేదు.

కిషోర్ మృతదేహాన్ని ఒక రిక్షాలో ఇంటికి తీసుకెళ్లారు. అయితే రిక్షాలో తీసుకెళ్తున్న ఈ దృశ్యాన్ని చూసి చాల మంది కంటతడి పెట్టారు. బంధువుల సహకారం తో కిషోర్ మృతదేహానికి తల్లి అంత్యక్రియలు జరిపించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిని ఓదర్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఆ తల్లికి వచ్చిన కష్టాన్ని చూసి గ్రామస్తులు కూడా విషాధచాయల్లో మునిగిపోయారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news