షర్మిల రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూసి మంత్రి కేటీఆర్‌కు భయం పట్టుకుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవిస్తున్నాడని, తన తండ్రి(వైఎస్ఆర్) చూపెట్టిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేసేది తాను అని వెల్లడించారు.
మంగళవారం ప్రముఖ దేవాలయం తుల్జా భవానిని సందర్శిస్తారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ , ఎన్సీపీ నుంచి నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇందు కోసం ఏకంగా 600 వాహనాలతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు సీఎం కేసీఆర్. దీనిపై నిప్పులు చెరిగారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సోమవారం ట్విట్టర్ వేదికగా నిలదీశారు. అసలు ప్రజల సొమ్ముతో ఎలా ప్రచారం చేసుకుంటారంటూ ప్రశ్నించారు. సోయి లేకుండా పాలన సాగిస్తున్న కేసీఆర్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజల రక్తాన్ని, మాంసాన్ని పీక్కు తింటున్న ఘనత బీఆర్ఎస్ నేతలకే దక్కుతుందని సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.