కొడుకు చేతిలో చనిపోయిన తల్లి…

-

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశాన్ని విషాదం లోకి నెట్టింది. ఆగ్రాలో ఆస్పత్రిలో ఒక మహిళ కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయింది. మమతా శర్మా అనే మహిళను ఆమె కొడుకు మోహిత్ శర్మ సోమవారం తెల్లవారుజామున నగరంలోని సరోజిని నాయుడు వైద్య కళాశాలకు తీసుకెళ్లాడు. ఆమె వయసు 61 ఏళ్ళు. ఆమె మంచం మీద నుంచి కింద పడిపోతుంది.

దీనితో తన తల్లిని కాపాడమని వైద్యుల కోసం అతను అరుస్తున్నా సరే వైద్యులు మాత్రం పట్టించుకోలేదు. దీనితో ఆమె తన కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది. ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం తో ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోన లక్షణాల్లో అది కూడా ఒకటి కావడం తో వైద్యులు ఆమెకు చికిత్స చేయడానికి ముందుకు రాలేదు. ఆమె శాంపిల్స్ ని అప్పటికే కరోనా టెస్టింగ్ కి పంపించారు వైద్యులు.

జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కొడుకు మోహిత్… “ఆమె నాకు చెప్పిన చివరి మాటలు – మీరు నన్ను ఇంట్లోనే చనిపోయేలా చేసి ఉండాలి” అని చెప్పినట్టు వివరించాడు. ఆగ్రా కరోనా హాట్ స్పాట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇతరులకు కూడా చికిత్స చేస్తున్నారు. మమతా శర్మ గత మూడేళ్లుగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే శ్వాస రుగ్మతతో బాధపడుతున్నారట. ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడం తో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. కరోనా లక్షణం కావడంతో ఆమెను తాకడానికి అందరూ భయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news