వావ్; కోతుల సామాజిక దూరం చూడండి…!

-

కరోనా రాకుండా ఉండాలి అంటే సామాజిక దూరం అనేది చాలా అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా అందరూ ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అయినా సరే చాలా మంది దాన్ని లైట్ తీసుకోవడం గమనార్హం. అయితే కోతుల గుంపు మాత్రం ఆహారం తినడానికి సామాజిక దూరం పాటించడం గమనార్హం. దీనికి సంబంధించిన ట్వీట్ ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మంగళవారం పోస్ట్ చేసారు.

మంగళవారం చేసిన ఈ ట్వీట్ లో కోతుల గుంపు రోడ్డు మీద కూర్చుని పుచ్చకాయ ముక్కలు తింటుంది. అవి సామాజిక దూరం పాటిస్తూ పుచ్చకాయ ముక్కలను తింటున్నాయి. ఈ సంఘటన అరుణా చల్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక మనిషి వాటికి అరటిపండ్లు మరియు పుచ్చకాయ ముక్కలను ఇవ్వడం మనకు కనపడుతుంది. కోతులు ఓపికగా ఇచ్చే వరకు ఎదురు చూడటం గమనార్హం.

“అస్సాం-అరుణాచల్ సరిహద్దు వెంబడి అరుణాచల్ ప్రదేశ్ లోని భలుక్ పాంగ్ సమీపంలో కనిపించే ఒక సంపూర్ణ సామాజిక దూరం అని ఆయన పోస్ట్ చేసారు. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మనుషులు సామాజిక దూరం పాటించకుండా ఉంటున్న సమయంలో కోతులు పాటించడం నిజం గా అభినందించే పరిణామం గా చెప్పుకోవచ్చు. కోతుల నుంచి మనుషులు వచ్చినా వాటిని చూసి మనుషులు నేర్చుకునే సమయం ఆసన్నమైంది.

Read more RELATED
Recommended to you

Latest news