టిఆర్ఎస్ లోకి మోత్కుపల్లి.. ముహూర్తం ఖరారు

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. మరో రెండు రోజుల్లో అంటే సోమవారం రోజున… మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకో నున్నారు మోత్కుపల్లి నర్సింహులు.

మోత్కుపల్లి నర్సింహులు తో పాటు… పలువురు దళిత నేతలు కూడా టిఆర్ఎస్ కండువా కప్పుకో నున్నారు. అంతేకాదు మోత్కుపల్లి నర్సింహులు కు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. దళిత బందు చైర్మన్ గా మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడు నెలల క్రితం బిజేపి పార్టీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.