బిజెపి పార్టీ దేవుడి పేరుతో పబ్బం గడుపుతుందని ఆరోపించారు మోత్కుపల్లి నరసింహులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కేసీఆర్ తప్ప ఏ ప్రతిపక్ష నాయకుడి గొంతు కూడా లేవడం లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రైతుల కల్లాలకు వెచ్చించిన డబ్బులను అడగడం చాలా దురదృష్టకరం అన్నారు మోత్కుపల్లి.
అలాగే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు కల్లాలకు ఖర్చు చేసిన డబ్బులను కేంద్రం అడగడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వకి నిదర్శనమన్నారు. రైతు కల్లాలకు ఖర్చు చేసిన 150 కోట్లు ఇవ్వడం కష్టం కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. తెలంగాణ రైతులకల్లాలకు వెచ్చించిన 150 కోట్లకు రికవరీని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.