MAA ELECTIONS : ‘మా’ ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ ట్వీట్

-

‘మా’ అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నానని… కుండబద్దలు కొట్టింది పూనమ్‌ కౌర్‌. తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్ కు విన్న విస్తానని స్పష్టం చేసింది. ప్రకాష్ రాజ్ మాత్రమే వాస్తవికంగా ఉంటాడని చెప్పుకొచ్చింది పూనమ్‌ కౌర్‌.

ప్రకాశ్ రాజ్ పెద్దల పట్ల గౌరవాన్ని, ఇచ్చిన మాట కు కట్టుబడి ఉంటాడని వెల్లడించింది. ప్రకాశ్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరని… అందుకే ఆయనకు తన మద్దతు ఉంటుందని చెప్పింది. మా ఎన్నికల్లో అందరూ ప్రకాశ్‌ రాజ్‌ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

కాగా… మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయాలు తారాస్థాయి చేరాయి. రాజకీయ పార్టీను తలదన్నేలా రాజకీయం నడుస్తోంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీపడుతున్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news