బెయిల్ కోసం అవినాష్ రెడ్డి పాట్లు.. సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్..

-

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తన ప్రయత్నాన్ని విరమించడం లేదు. వివేకా హత్య కేసులో సిబిఐ ఇతన్ని అదుపులోకి తీసుకోవాలని విచారణ పేరుతో చాలాసార్లు పిలిచినా ఎప్పటికప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ అవినాష్ రెడ్డి తప్పించుకుంటున్నాడు. ఒకవేళ అరెస్ట్ జరుగుతుందని భావించి తెలంగాణ హై కోర్ట్ లో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకున్న, ఆ పిటీషన్ ను హై కోర్ట్ రద్దు చేసింది. ఇప్పుడు ఆ బెయిల్ కోసం సుప్రీమ్ కోర్ట్ లో ఈ రోజు పిటీషన్ వేయడం జరిగింది. ఈ పిటీషన్ లో తెలంగాణ హై కోర్ట్ వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటీషన్ ను విచారించాలని కోరారు. మరి ఈ విషయంపై సుప్రీమ్ కోర్ట్ ఏ తీర్పును ఇవ్వనుంది అన్నది తెలియాల్సి ఉంది.

కాగా రెండు రోజుల క్రితం సిబిఐ అవినాష్ రెడ్డిని విచారణకు రమ్మని చెప్పగా, అందుకు అవినాష్ రెడ్డి తాను రాలేనని లేఖ రాశాడు. దీనితో మళ్ళీ 19వ తేదీ విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ వాయిదాకు అయినా అవినాష్ రెడ్డి హాజరవుతాడా లేదా అన్నది తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news